హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీ పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులు మంగళవారం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి రావాలని సూచించారు.
ఈ రోజు రాలేని అభ్యర్థులు ఉంటే బుధవారం హాజరు కావాలని సూచించారు. కాగా జేఎల్ ఉర్దూ మీడియం పోస్టులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసినట్లు మరో ప్రకటనలో పేర్కొన్నారు.