28-02-2025 01:14:05 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): సింగరేణి పురిటిగడ్డగా బొగ్గుట్ట (ఇల్లెందు)కు పేరున్నది. ఇక్కడి బొగ్గు గనులకు 135 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాం టి ఏరియా మున్ముందు తన ప్రభను కోల్పో యే పరిస్థితి కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. అందుకు ఈ ప్రాంతంలోని ఏకైక ఉపరితల గని (ఓసీ) అయిన జవహర్ ఖని(జేకే) - 5 ఓసీలో బొగ్గు నిల్వలు చివరి దశకు చేరుకుని.. మూతపడే స్థితికి రావమే కారణం.
మార్చి మాసాంతంలోపు యాజమాన్యం ఓసీని మూసేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో 250 మంది గని కార్మి కుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు జేకే-5 పూసపల్లి ఓసీ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. విస్తరణ పనులకు అన్ని అనుమతులు వచ్చి, బొగ్గు తవ్వకాలు మొదలు కాకపోతే తాము ఇతర ప్రాంతాలకు బదిలీపె వెళ్లాల్సి వస్తుందని కార్మికులు చెప్తున్నారు.
అనుమతులు వస్తేనే సర్వే..
ఇల్లెందు- 5 ఓసీ పూసపల్లి విస్తరణ ప్రాజెక్ట్‌కు స్టేజీ- 2 అనుమతులు లభిస్తేనే ప్రభావిత ప్రాంతాల నివాస ప్రజలకు పునరావాస పథకాల అమలు కోసం అధికా రులు సర్వే చేపడతారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించి జనాభా సర్వే పూర్తయింది. సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించాల్సి ఉంది. నిర్వాసితులు నష్టపోతున్న ఆస్తుల సర్వే మొదలుకొని వారి పునరావాసానికి సంబంధించి ప్యాకేజీలకు అర్హులైన వారిని గుర్తించాల్సి ఉంది.
దీనికితోడు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ప్రభావిత నిర్వాసితులైన ప్రజలకు వివరించాల్సి ఉంది. అందుకు వారి ఆమోదం తెలిపితేనే పరిహారాలు చెల్లించిన తర్వాత పూసపల్లి ఏరియాలో ఓసీ విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో మార్చి 31 నాటికి జేకే 5 ఓసీ మూతడనుంది. ఆ గనిలో పనిచేస్తున్న కార్మికులను ఇదే ఏరియాలోని కోయగూడెం, పూసపల్లి గనుల్లో సర్దుబాటు చేయాలన్న యోచనలో యాజమాన్యం ఉంది.
ఇప్పటికే రాష్ట్రానికి వెలుగును ప్రసాదించే పాల్వంచ గని కనుమరుగయ్యింది. ఉన్న కేటీపీఎస్ ఓఅండ్‌ఎం (8 యూనిట్లు) కూల్చేయడంతో ఆ కార్మాగారంలో పనిచేసిన కార్మికులను ఇతర ప్రాజెక్టుల్లో సర్దుబాటు చేశారు. సింగరేణి పురిటిగడ్డగా పేరొందిన ఇల్లెందుకు సింగరేణి శోభ కొనసాగాలంటే జేకే 5 విస్తరణ పనులకు అవసరమైన అనుమతులకు ప్రజాప్రతినిధులు, మంత్రులు చిత్తశుద్ధితో పనిచే యాల్సి ఉంది. లేని పక్షంలో ఇల్లందుకూ పాల్వంచ పరిస్థితి ఎదురవ్వనున్నది.
విస్తరణకు అనుమతులు ఇలా..
ఇల్లెందు ప్రాంతంలో జేకే 5 ఓసీ (పూసపల్లి) విస్తరణకు రెండేండ్ల కిందటే ప్రజా భిప్రాయ సేకరణ నిర్వహించి, ఆమోదం కూడా పొందారు. విస్తరణతో తిలక్‌నగర్, విజయలక్ష్మినగర్, కుమ్మరి బస్తీ, 21 ఫిట్ ఏరియాలు ప్రభావితమవుతున్నాయి. నూతన ఓసీ విస్తరణకు అటవీశాఖ స్టేజ్ 1 అనుమతులు లభించినా, పర్యావరణ అనుమతులు, అటవీశాఖ స్టేజీ 2 అనుమతులు రావాల్సి ఉంది.
భద్రాద్రి కొత్తగూ డెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అటవీప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఓపెన్‌కాస్ట్ పనులకు సంబంధించి రెండు జిల్లాల అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. దీనికి తోడు అటవీశాఖ భూసేకరణ కోసం రూ.30 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది.
అనుమతులు వస్తే విస్తరణ పను లు ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. 18 కిలోమీటర్ల పరిధిలో ఓసీ రేడియేషన్ ప్రభావిత ప్రాం తంగా ఉండటంతో అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల కోసం యాజమాన్యం ఎదురుచూస్తోంది.