19-04-2025 07:03:01 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో జేకే ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ఆనాడు ప్యాకేజీ అందక నష్టపోయిన నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం నిర్వాసితులలో కొంతమందికి జేకే క్వార్టర్స్ లో నివాసం కొరకు ఇచ్చిన క్వార్టర్స్ ను ఖాళీ చేయించి కూల్చడానికి చేస్తున్న ప్రయత్నలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి జియం కార్యాలయం శనివారం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జియంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి మాట్లాడుతూ.. జెకే ఓసి విస్తరణలో నష్టపోయిన వారికీ ఎటువంటి ఆధారం చూపించకుండా ఇచ్చిన క్వార్టర్స్ నుండి బలవంతంగా పంపించి వేయాలని సింగరేణి అధికారులు చూస్తున్నారని అన్నారు.
ఆనాటి ఆర్డీఓనే స్వయంగా ఇచ్చిన స్థలలు కేటాయించిన పట్టాలను చెల్లవని, ఇవి తాము ఇచ్చిన పట్టాలు కావని, నకిలీ పట్టాలు అని అధికారులు అనడం హాస్యాస్పదం ఉందని అన్నారు. పట్టాలు ఇచ్చిన అధికారులే నకిలీ పట్టాలు అనడం పలు అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు. నిర్వసితులు కొద్దీ మంది మాత్రమే ఉన్నారనే ఆలోచనతో అధికారులు పట్టించుకోకుండా భయపెట్టి, బెదిరించి బయటకు పంపాలని చూస్తున్నారని నిర్వసితులందరికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు ప్రత్యన్మయం చూపిన తర్వాతనే ఖాళీ చేయించాలని లేని పక్షంలో ఉద్యమలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్యాకేజీ విషయం లో అనేక అవకతవకలు జరిగాయని ఈ విషయంను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నిర్వసితులందరికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎ నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేష్ మరియు జేకే ఓసి నిర్వసితులు అశోక్ పాసి, సరస్వతి పాసి, లలిత, చంద్రకళ, సుభద్ర, పార్వతి పాసి, కిషోర్, బాబూలాల్ పాసి, అనిల్, కుమారస్వామి, ఎల్లమ్మ, నర్సయ్య, లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.