calender_icon.png 10 January, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆధునీకరించాలి

09-01-2025 08:45:10 PM

ఆరెకటిక మండేదార్ అసోసియేషన్, చర్మకష్ వర్కర్స్ యూనియన్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆధునీకరించాలని ఆరెకటిక మండేదార్ అసోసియేషన్, చర్మకష్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరెకటిక పలు సంఘాల ప్రతినిధులతో కలిసి ఆరెకటిక మండేదార్ అసోసియేషన్ అధ్యక్షులు కే.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీ.అశోక్ కుమార్, చర్మకష్ సంఘ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వీ.శశికాంత్ రావు, ప్రధాన కార్యదర్శి పీ.దర్శన్ లు మాట్లాడుతూ.. స్లాటర్ హౌస్ మేకలు, గొర్రెలు ప్రధాన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, ఖుర్షి-ముస్లిం ప్రజల అట్టడుగు వర్గాల జీవనాధారం అని తెలిపారు. స్లాటర్ హౌస్, మండిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.

హౌస్ లో లైవ్ మేకలు, గొర్రెలు, పార్కింగ్ విక్రయానికి రుసుము ద్వారా జీహెచ్ఎంసీకి సంవత్సరానికి మూడు కోట్ల పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. రోడ్లు శుభ్రం చేయడం, వర్షపు నీటి బురద తొలగించడం వంటి సౌకర్యాలు లేవని జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వమే ఆధునిక స్లాటర్ హౌస్ నిర్మాణం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. ఈ సమావేశంలో ఆరెకటిక ఆఫ్ఫాల్స్ అసోసియేషన్, ఏకే.గోట్ అండ్ షిప్ హెడ్ రోస్టర్స్ అసోసియేషన్, ఏకే ఆఫ్ఫాల్స్ క్లీనర్ అసోసియేషన్, ఏకే రిటైర్డ్ మీట్ వెండర్స్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.