calender_icon.png 20 April, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 21ను వెనక్కి తీసుకోవాలి

08-04-2025 12:39:11 AM

 -పీ యూ ఒప్పంద అధ్యాపకులు

మహబూబ్ నగర్ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పరిపాలన భవన్ యందు తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ లలో సహాయ ఆచార్యుల నియామకం కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 21 ను తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం వీసీ ఆచార్య జీ ఎన్ శ్రీనివాస్ కి రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ బాబు కి ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాకే మిగిలిన పోస్ట్ లను నియమించాలని వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా సంఘం నాయకులు డా భూమయ్య గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీ లను నమ్ముకొని పనిచేస్తున్నామని, జేల్స్ డిగ్రీ లెక్చరర్ లను క్రమబద్దీకరించినట్టే యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దికరించాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో డా రవికుమార్, డా శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డా వెంకటేష్, డా కరుణాకర్ రెడ్డి డా రవికాంత్,డా విజయ్ భాస్కర్, డా సోమేశ్వర్, డా శ్రీనివాస్, డా జంగం విశ్వనాధ్, డా బషీర్ అహ్మద్, డా ఆంజనేయులు,డా మృదుల, స్వాతి, సరిత, శారద,డా రామ్మోహన్, డా సిద్దరామ గౌడ్, డా శివ కుమార్ సింగ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు