calender_icon.png 23 December, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో నెంబర్ 477 రద్దు చేయాలి

08-10-2024 01:09:15 AM

  1. మూసీ బాధితులతో ప్రభత్వం చర్చలు జరపాలి
  2. బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్ వెంటనే జీవో నెంబర్ 477ను రద్దు చేసి, మూసీ బాధితులతో చర్చలు జరిపిన తర్వాతే ప్రక్షాళన చేపట్టాలని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ సూచించారు. లక్షన్నర కోట్లతో చేపట్టే ప్రాజెక్ట్ ఖర్చు వివరాలను ప్రజలకు వివరించాలని కోరుతూ సోమవారం సీఎం రేవంత్, మంత్రులకు బహిరంగ లేఖ రాశారు.

మూసీనది ప్రక్షాళన పేరుతో పేదల ఆవాసాలను తొలగించడం సరికాదన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో బుల్డోజర్ విధానాన్ని అనుసరిస్తూ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను రాత్రికిరాత్రే బలవంతంగా వెళ్లగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మూసీనది ప్రాజెక్ట్‌పై ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చిన ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏఆర్‌ఆర్ చట్టంలోని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు.