మృతి పట్ల సంతాపం ప్రకటించిన పలువురు
దుబ్బాక (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణ రెడ్డీ పోరాటం మరువలేనిదని జర్నలిస్ట్ మూర్తి నరేష్ రెడ్డీ,మూర్తి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణించిన సందర్బంగా అయన చిత్ర పటానికి రెడ్డి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి, స్వరాష్ట్ర ఆకాంక్ష ను నెరవేర్చడానికి చేసిన పోరాటం భవితరాలకు స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు.
నల్గొండ జల్లాలో స్వంత డబ్బులతో ప్లోరైడ్ రక్కసిని నివారించడానికి గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధికేంద్రాలె సజీవ సాక్ష్యం అన్నారు. ఆంధ్ర పాలకుల్లో చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఆచర వ్యవహారాలను కాపాడడానికి తన స్వంత డబ్బులతో తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రామలను చేసారన్నారు.అలాంటి వ్యక్తి మరణం బాధాకరమని, అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమం లో మూర్తి శ్రీనివాస్ రెడ్డీ, కిష్టంగారి సుభాష్ రెడ్డి, కిష్టంగారి శ్రీనివాస్ రెడ్డి,కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మరెడ్డి, రాజిరెడ్డి, నాగిరెడ్డి, రాజిరెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.