రాకేశ్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. విరించివర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం బుధవారం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా హీరో రాకేశ్ మాట్లాడుతూ..
“నేను ‘జితేందర్‌రెడ్డి’ సినిమా చేయడానికి ఈ కథే కారణం. కొన్ని ఇష్యుస్ వల్ల సినిమా పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడే బ్యాన్ చేస్తామంటున్నారు. సినిమా చూసి, అందులో ఏం ఉందో కూడా చూడకుండా అలా మాట్లాడుతున్నారు. జితేందర్‌రెడ్డి ఒక ఫైటర్. ఆయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది.
ఈ సినిమాకు రూ.75లతో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ.. ‘జితేందర్‌రెడ్డి గారి కథ విన్నాక ఈ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యా. ఈ సినిమాకి చాలా పెద్ద స్పాన్ ఉంది. ఈ సినిమా నిర్మాత వారి సోదరుడి కథ చెపుదాం అని ముందుకొచ్చారు.
కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేశారు’ అన్నారు. నిర్మాత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జితేందర్‌రెడ్డి జీవితం ఒక చరిత్ర. ఆ కథను చాలా బాగా చూపించారు. జగిత్యాలలో ప్రీమియర్ వేశాం. చూసిన వాళ్లు చాలా మంది కళ్లనీళ్లు పెట్టుకున్నారు’ అన్నారు.