calender_icon.png 19 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

317 జీవో బాధితులు ఆందోళన చెందొద్దు

07-07-2024 01:45:34 AM

మంత్రి దామోదర్ రాజనర్సింహా

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): జీవో నంబర్ 317 బాధిత ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నారని, ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన ఉద్యోగ సంఘా ల నాయకులతో స్థానికత, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, జిల్లాల విభజన, జోనల్, మల్టీ జోన ల్, స్పౌజ్ బదిలీల అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిస్తామని మంత్రి స్పష్టం చేశారు.