calender_icon.png 23 January, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో-317 సమస్యకు మోక్షం

22-10-2024 01:43:43 AM

  1. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికపై హర్షం
  2. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో జీవో-317తో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం సోమవారం నాంపల్లిలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లచ్చిరెడ్డి మాట్లాడుతూ జీవో-317పై సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించి ఈ నెల 26వ తేదీన క్యాబినెట్ సమావేశంలో నిర్ణ యం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెడింగ్‌లో ఉన్న ఐదు డీఏలను చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగుల హెల్త్ స్కీంపై ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనర ల్ సెక్రటరీ కే రామకృష్ణ, డా. జీ నిర్మల, దర్శన్ గౌడ్, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.