calender_icon.png 11 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంవోకు 317 జీవో ఫైలు!

11-01-2025 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): విద్యాశాఖలోని 317 జీవో స్పౌజ్ బాధితులకు సంబంధించిన ఫైలు సీఎంవోకు చేరినట్టు తెలిసింది. ఎప్పటి నుంచో స్పౌజ్ బదిలీల సమస్య పెండింగ్‌లో ఉంది. 317 జీవో అమలుతో భార్య ఒకచోట, భర్త ఒకచోటికి బదిలీలయ్యారు. దీంతో తాము కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక రూపొందించింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంవోకు చేరినట్టు శుక్రవారం తెలిసింది.