మలేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్
న్యూఢిల్లీ: ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా మలేషియాతో జరగనున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) 26 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇటీవలే ఆసియా కప్‌తో పాటు ఐఎస్ఎల్ టోర్నీకి దూరమైన జింగాన్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ఫార్వార్డ్ ప్లేయర్ ఇర్ఫాన్ యద్వాద్కు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అక్టోబర్ 12న వియత్నాంతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. 26 మంది ప్రాబబుల్స్‌లో ముగ్గురు గోల్ కీపర్లు, 9 మంది డిఫెండర్లు, 8 మంది మిడ్ ఫీల్డర్లు, ఆరుగురు ఫార్వార్డ్ ప్లేయర్లు ఉన్నారు.