నగలను ఇష్టపడని మగువలు ఉంటారా? ఆభరణాలను వాళ్ల అభిరుచులకు ఇష్టంగా ఎంచుకుంటారు. సందర్భాన్ని బట్టి నచ్చిన నగలను అలకరించుకుంటారు. పెళ్లిలాంటి వేడుకల్లో మాత్రం సంప్రదాయ నగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సరికొత్త డిజైన్లతో ముస్తాబవుతున్నాయి నగలు. నెక్లెస్ డైమండ్ పెండెంట్‌తో మెరిసి పోతుంటే, మరోటి చక్కని నగిషీల టెంపుల్ లాకెట్‌తో కాంతులీనుతుంది, మరొకటి ముత్యాల గుత్తులతో ఆకట్టుకుంటోంది.
స్టులిష్ డ్రెస్సుల మీదకు, చీరల మీదకు నప్పేలా.. సింపుల్‌గా, గ్రాండ్‌గా వస్తున్నాయి నగలు. రంగు రంగుల రాళ్లతో పాటు డైమండ్, కుందన్, పోల్కీ డైమండ్స్‌తో తీర్చిదిద్దిన పెండెంట్లు మగువల్ని ఎంతగానో మురిపి స్తున్నాయి. వాటిలో జిగేలుమనిపించే కొన్ని నగలు మీ కోసం..
ముత్యాల గుత్తులు
చిన్న చిన్న చిట్టి ముత్యా లు.. హరానికి నిండుతనాన్ని నింపుతాయి. ముత్యాల మధ్యలో ఉండే ఆకుపచ్చ, ఎరుపు రంగుల స్టోన్స్ హరం అం దాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
కంఠ హరం
ఇది చూడటానికి చాలా హుందాగా కనిపిస్తుంది. గుండ్రటి హరానికి ఒక్కటే పెద్ద పెండెంట్ రావడం వల్ల అందంగా కనిపిస్తుంది. దీన్ని రాణివారి నగ అని కూడా అంటారు.
పాపిడి బిళ్ల
పాపిడి బిళ్ల.. ఇది మగువలు మెచ్చే నగ. సందర్భం ఏదైనా సరే.. పాపిడి బిళ్ల పెట్టుకుంటే లక్ష్మీదేవతలా కనిపిస్తారు.
కాసుల పేరు
అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నగ ఏదంటే.. కాసుల పేరు అని చెప్పొచ్చు. కాసుల పేరులోని బిళ్లలపై వచ్చే డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. మెడ లో కాసుల పేరు ఒక్కటి వేసుకున్న హుందాగా కనిపిస్తారు.
ముక్కు పుడక
ఎన్ని డిజైన్లు.. ఎన్ని హరాలు వచ్చినా.. కూడా అమ్మాయిలకు ముక్కు పుడక లేకపోతే.. ముఖం బోడిగా కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా డిజైన్లు వచ్చాయి. అయినా సింపుల్‌గా ఉండే డిజైన్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు మగువలు.
వడ్డాణం
చీర మీదకైనా.. లెహంగా మీదకైనా.. వడ్డాణం పెడితే ఆ లుక్కే మారిపోతుంది. వడ్డాణం పెడితే చాలా ఫిట్‌గా, కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అమ్మాయిలు.
గాజులు
అమ్మాయిల చేతికి గాజులు చాలా అందంగా కనిపిస్తాయి. గాజుల మధ్యలో లేదా చివర్లో వేసుకునే సైడ్ గాజులు అందమైన డిజైన్లలో వస్తున్నాయి.