విజేతకు 3 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్
సికింద్రాబాద్: 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల నేషనల్ చాంపియన్‌షిప్ విజేతగా జార్ఖండ్ నిలిచింది. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో జార్ఖండ్ 1 తో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో జమునా కుమారి (ఆట 15వ నిమిషం) జార్ఖండ్‌కు ఏకైక గోల్ అందించింది.
హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా మూడో స్థానంలో నిలిచింది. ప్రియాంక హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసింది. యువ టాలెంట్‌ను ప్రోత్సహించడం లక్ష్యమని తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజేతగా నిలిచిన జార్ఖండ్‌కు రూ. 3 లక్షల నగదు, మధ్యప్రదేశ్‌కు రూ. 2 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. లక్ష క్యాష్‌ప్రైజ్ ప్రకటించారు. విజేత, రన్నరప్‌లకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ట్రోఫీతో పాటు పతకాలను బహుకరించారు.