calender_icon.png 14 November, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటెత్తనున్న జార్ఖండ్

13-11-2024 02:02:33 AM

తేలనున్న 685 మంది భవితవ్యం

రాంచీ, నవంబర్ 12: నేడు జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. 685 మంది నేతల భవితవ్యం నేటి ఎన్నికలతో తేలనుంది. 43 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగుతున్నాయి. ‘ఇండియా’ కూటమితో పాటు ఎన్డీఏ కూటమి నేతలు, పలు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడత ఎన్నికల్లో పశ్చి మ జంషెడ్‌పూర్ స్థానం నుంచి అత్యధిక మంది అభ్యర్థులు అలాగే జగన్నాథ్‌పూర్ నుంచి అతి తక్కువ మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నేటితో పాటు నవంబర్ 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత రెండు వారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా జార్ఖండ్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపు తున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు అతని సతీమణి ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కూడా ప్రచారపర్వంలో మునిగిపోయారు. కాంగ్రెస్ కీలకనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు కూడా పలు ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. 

ప్రసన్నం చేసుకునేందుకు.. 

పలు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి నా కానీ పోటీ మాత్రం ప్రధానంగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ఇండియా కూటమిలోనే ఉన్నారు. మరి జార్ఖండ్ ప్రజలు మరోమారు ఇండియా కూటమికి పట్టం కడతారా లేదా మార్పు కోరుకుంటారో తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.