calender_icon.png 15 November, 2024 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 59.28 శాతం ఓటింగ్

13-11-2024 04:31:31 PM

జార్ఖండ్,(విజయక్రాంతి): జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలీంగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలీంగ్ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు, సామస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్ర 4 గంటల వరకు కొనసాగుతుంది.  జార్ఖండ్  81 స్థానాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి విడత పోలీంగ్ కొనసాగుతోంది.

43 అసెంబ్లీ నియోజకవర్గాలకు 683 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఝార్ఖండ్ లోని మిగిలిన 38 స్థానాలకు నవంబర్  20న రెండో విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గతంతో పోల్చితే ఈసారి జార్ఖండ్ లో ఎన్నికల వాతావరణం వాడివేడిగా జరుగుతోంది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి అధికారం నిలుపుకోవడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తుండగా... ఝార్ఖండ్ లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది.