calender_icon.png 14 November, 2024 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: ఉదయం 9 గంటలకు 13 శాతం ఓటింగ్

13-11-2024 11:00:33 AM

రాంచీ: జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 13.04 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. జార్ఖండ్ లో  43 నియోజకవర్గాల్లో 81 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా సిమ్‌డేగా స్థానంలో 15.09, రాంచీలో 12.06, సెరైకెలా-ఖర్సవాన్ 14.62 శాతం పోలింగ్ నమోదైంది. 43 నియోజకవర్గాల్లో 17 సాధారణ సీట్లు, 20 షెడ్యూల్డ్ తెగలకు, ఆరు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేయబడ్డాయి. మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది.

31 నియోజకవర్గాల్లోని 950 పోలింగ్ బూత్‌లు సున్నితమైనవిగా గుర్తించబడినందున భారత ఎన్నికల సంఘం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మాక్ పోల్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సమస్యాత్మక  బూత్‌లలో సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగుస్తుందని అధికారులు వెల్లడించారు.

తొలి దశలో 43 స్థానాలకు 73 మంది మహిళలు సహా మొత్తం 638 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, భారతీయ జనతా పార్టీ 25, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.