బాలీవుడ్ బ్యూటీ, అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అందమైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే అటు వెస్ట్రన్, ఇటు ట్రెడిషనల్ క్యాస్టూమ్స్ తో అట్రాక్ట్ చేయడం జాన్వీ ప్రత్యేకత. తాజాగా చీరకట్టుతో నడుము అందాలను ప్రదర్శించి జిగేల్ అనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా జాన్వీ అభిమానులు చెప్పుకుంటున్నారు. తారక్ తో పాటు రామ్ చరణ్తో RC 16 సత్తా చాటాలని భావిస్తోంది జాన్వీ.