లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై, ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. ఈ సినిమాను తెలుగులో ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై విడుదల కానుంది. నవంబర్ 29న విడుదల చేయనున్నట్టు నిర్మాత డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మంగళవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తమిళ్లో సూపర్ హిట్ అయిన ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. లక్మీరాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆమె చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటాయి. థ్రిల్లర్ మంజు రూపొందించిన 8 ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్‌ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపీఎస్ ఆఫీసర్‌గా, గ్రామాల్లో రౌడీల ఆగడాలకు అడ్డుకట్ట వేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీరాయ్ తన నట విశ్వ రూపాన్ని ఇందులో చూడొచ్చు. విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ లాంటి సినిమా ఇది” అని చెప్పారు.