23-03-2025 12:00:00 AM
పెళ్లి.. జీవితంలో ఒకేసారి వచ్చే వేడుక. అందుకే ఈ రోజున వధువులు ఏ విషయంలోనూ రాజీపడరు. ముఖ్యంగా తాము ధరించే దుస్తులు, నగల విషయంలో అయితే మరీనూ! పెళ్లిలో తమ అభిరుచులకు తగినట్టుగా బంగారు నగల్ని డిజైన్ చేయించుకుని మెరిసిపోతుంటారు నవవధువులు. కాని, ప్రస్తుతం దుస్తుల్లాగే నగల ట్రెండూ మారుతోంది. బంగారాన్ని నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటున్నారు వధూవరులు. సంస్కృతీ, సంప్రదాయాలకు, నాణ్యతకు, స్వచ్ఛతకు నిదర్శనం సీఎంఆర్ జ్యువెలరీ!
తెలుగు రాష్ట్రాల్లో.. సంప్రదాయాల్ని మేళవిస్తూ విభిన్న ఆభరణాల్ని మనముందుకు తీసుకొస్తున్నది. ఐదేళ్ల క్రితం వజ్రాల నగలన్నీ ఎక్కువగా 18 క్యారట్ల బంగారంతో చేసేవారు. ఇప్పుడు వాటిని 14 క్యారట్లతోనూ చేస్తున్నారు. దాంతో వినియోగదారుల బడ్జెట్‌లో పెద్ద తేడా ఉండటం లేదు. పైగా ఈ లైట్ వెయిట్ జ్యువెలరీలో బరువైన సెమీప్రెషీయస్ రాళ్లనీ ముత్యాల్నీ ఎక్కువగా వాడుతున్నారు. దాంతో బడ్జెట్‌లోనే అందమైన భారీ నగ వచ్చేస్తోంది.
ప్రస్తుతం ఏ శుభకార్యమైనా అతివలకు గుర్తొచ్చే ఆభరణాలు టెంపుల్ జ్యువెలరీ. ఉత్తరాదినైనా, దక్షిణాదినైనా ప్రస్తుతం చాలామంది వధువులు వీటిని ఎంచుకుంటున్నారు. నిజానికి ఈ ఆభరణాలు పూర్వకాలంలో చోళ, పాండ్య రాజవంశీయులు ధరించేవారట! వాటి డిజైన్లు, దేవతా మూర్తుల రూపాల్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నగలు కాలక్రమేణా అక్కడి వారి సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగమయ్యాయి. వాటిని పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ధరించడం ఓ ట్రెడిషన్‌గా మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతున్నది.
పాపిట బిళ్లలు..
పెళ్లిలో పెళ్లికూతురు నగల్లో ప్రత్యేకంగా ఆకట్టుకునేది కెంపులతో కూడిన నగలు.. హెడ్ జ్యుయలరీ, సూర్య ఆకృతులతో కూడిన పాపిట బిళ్లలు, వెండితో భారీగా తయారుచేసిన పట్టీలు, మెట్టెలు.. వంటివి ధరించడం సంప్రదాయంగా కొనసాగుతున్నది. తమ సౌభాగ్యానికి ప్రతీకగా విశ్వసిస్తుంటారు.
చోకర్..
టెంపుల్ జ్యువెలరీలో వడ్డాణాలూ, పెద్ద పెద్ద హారాలూ, చోకర్‌లూ, నెక్లెసులూ, బుట్టలూ, ఉంగరాలూ.. ఇలా ఎన్నెన్నో నగలు సందడి చేశాయి. వాటికి సరిపోయే కొన్ని బంగారు గాజులూ సీతారాముల వంటి దేవుళ్ల రూపాలతో అమ్మాయిల చేతులపైకి చేరిపోయాయి.
టెంపుల్ జ్యువెలరీ
సెలబ్రిటీలు, ఇటు సామాన్యులు తమ పెళ్లిళ్లలో లక్ష్మీ, గణపతి, ఇతర దేవతా మూర్తులు, గుళ్లు ప్రతిరూపాలతో రూపొందించిన విభిన్న రకాల నగల్ని తమ వెడ్డింగ్ జ్యువెలరీలో భాగం చేసుకుంటూ మెరిసిపోతున్నారు.
గాజులు
పెళ్లికి ముందు పెళ్లి కూతురిని చేయడం, హల్దీ, సంగీత్, మెహెందీ.. వంటి వేడుకలు చేసుకోవడం తెలిసిందే.. అయితే ఆయా ప్రాంతాల సంప్రదాయాల్ని బట్టి అదనంగా మరికొన్ని వేడుకలు జరుపుకుంటుంటారు. ఈ గాజులను ఇప్పుడు ప్రత్యేకంగా డిజైన్లు చేస్తున్నారు. బీడ్స్, ముత్యాలు, స్టోన్స్, జుంకాలు.. వంటి మెటీరియల్స్‌తో ఇవి మెరిసిపోతున్నాయి. అయితే కొంతమంది వధువులు వీటిని తమ అభిరుచులు, వెడ్డింగ్ థీమ్, ప్రేమకథకు తగినట్లుగా కస్టమైజ్ చేయించుకోవడం ఈమధ్య సెలబ్రిటీ పెళ్లిళ్లలో మనం ఎక్కువగా చూస్తున్నాం.