calender_icon.png 11 January, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికురాలి బ్యాగులో ఆభరణాలు చోరీ

15-07-2024 02:29:30 AM

ఎల్బీనగర్, జూలై 14: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులోని ఆభరణాలు చోరీ అ య్యాయి. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని వాస్తుకాలనీకి చెందిన పద్మలత శుక్రవారం తన అక్కాచెళ్లళ్లు శైలజ, కళావతితో కలిసి తన బంగారు ఆభరణాలను రీమో డలింగ్ చేయించడానికి మాల్లాపూర్‌లోని సూర్యానగర్‌కాలనీకి వెళ్లారు. అక్కడ బిడ్స్ బ్రైన్ 15గ్రాములు, బ్రా స్లెట్ 9 గ్రాములు, చిన్న బిడ్స్ బ్రైన్ 4గ్రాములు ఆభరణాలను రీమోడలింగ్ చేయించుకున్నారు.

మల్లాపూ ర్ నుంచి హబ్సీగూడ వరకు ముగ్గు రు కలిసి ఆటోలో వెళ్లారు. అక్కడ నుంచి పద్మలత ఎల్బీనగర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కి, కామినేని దవాఖాన స్టాప్ వద్ద దిగింది. కొంత దూ రం వెళ్లిన తర్వాత బ్యాగును చూసేసరికి బంగారు ఆభరణాలు కనిపిం చలేదు. ఆభరణాలు చోరీ అయ్యాయని గుర్తించి శనివారం ఉస్మాని యా యూనివరిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు జీరో ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేశారు. అనంతరం కేసును ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.