ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 7: దివాళా పరిష్కార ప్రక్రియ ప్రయత్నాలు విఫలం కావడంతో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ లిక్విడేషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక నష్టా లతో 2019లో జెట్ ఎయిర్‌వేస్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్‌ను జలాన్ కర్లాక్ కన్సార్టియం దక్కించుకొంది.
ఆ తరువాత రుణదాతలకు కన్సార్టియం మధ్య విభేదాలు రావడంతో ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ సమర్థించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా రుణదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం జెట్ ఎయిర్‌వేస్ లిక్విడేషన్ ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసిపోయింది.