మానకొండూర్, డిసెంబర్22: యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎల్‌ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్ లో క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో ముందస్తు ముందస్తు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన అధ్యక్షత వహించారు. అంతకు ముందుకు ఆయన క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో పాస్టర్ తియోతి జయరాజ్, రెవ.రెడ్డిమల్ల ప్రసాద్, ప్రిన్స్ వెస్లీ, మామిడి మంజుల అనిల్, కె.రోజిలిన బెన్ హర్ , కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ పురమల్ల శ్రీనివాస్, తిమ్మాపూర్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, సులోచన-శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు మామిడి అనిల్, తోపాటు పలువురు రెవెన్యూ,పోలీసు అధికారులు పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చ్ కమిటీ సభ్యులు కె.బెన్ హర్, లాజరస్, దేవ ఆశీర్వాదం, జి.పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.