- క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అన్ని మాతల సారాంశం మానవత్వ మేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు.
ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతిదూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలస్తుందని అన్నారు. ఏసు బోధనలను అనుసరించిన అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర మంతటా క్మిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
సర్వమత హితంగా పరిపాలన: భట్టి
క్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం పంచారని, ఆయన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని చెప్పారు. క్రీస్తు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్వమత హితంగా పరిపాలన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
శాంతి సందేశం ఇచ్చిన యుగకర్త
కాంగ్రెస్ మూల సిద్ధాంతం లౌకికవాదమని, సర్వమత సహనం, అందరినీ సమానంగా గౌరవించడం పార్టీ సంప్రదాయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ పేర్కొన్నారు. ఏసు మార్గంలో పయనించి జీవితాన్ని శాంతిమయం చేసుకుందానమి పిలుపునిచ్చారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినమన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్