calender_icon.png 20 April, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో జీసస్ ఈస్టర్ ర్యాలీ

19-04-2025 08:56:12 PM

కాటారం (విజయక్రాంతి): కాటారం డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో సిలువ విజయ యాత్రను నిర్వహించారు. యేసు క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాలకు పూర్వం సిలువ వేయబడి, మూడవ దినమున తిరిగి లేచిన సందర్భమును జ్ఞాపకం చేసుకుని ఏసు ప్రభువు మరణమును గెలిచి తిరిగి లేచి తద్వారా మానవులకు పాప క్షమాపణ, శాంతి, నిత్యజీవమును, రక్షణ, సమాధానమును ప్రసాదించుటకు వచ్చిన దేవుడుగా నిరూపించుకున్నాడని కాటారం డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పాస్టర్ కమిటీ సభ్యులు పాస్టర్లు డేవిడ్ మార్క్, ఆదాము, బన్సిలాల్, ప్రకాష్, ఐజాక్, జీవరత్నం, బ్రదర్ ప్రభుదాస్ ఆయా మండలాల పాస్టర్ల కమిటీ ప్రసిడెంట్, సంఘ పెద్దలు, క్రైస్తవ యూత్ పాల్గొన్నారు.