20-04-2025 07:59:07 PM
మంథని బెతేల్ గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ లో పునరుత్థాన కార్యక్రమంలో శ్రీను బాబు..
మంథని (విజయక్రాంతి): యేసుక్రీస్తు అందరిని ఒకే విధంగా ప్రేమిస్తారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు తెలిపారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మంథని పట్టణంలోని ఎరుకలగుడంలో గల బెతేల్ గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ లో జరిగిన పునరుత్తాన ఆరాధనలో పాలు పొంది క్రైస్తవులకు ఏసుక్రీస్తు పునరుత్థానని సందర్భంగా శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు పాల్గొని మాట్లాడుతూ... యేసుక్రీస్తు అందరిని ఒకే విధంగా ప్రేమించాలని అదే మార్గంలో మేము కూడా మంథని నియోజకవర్గంలో ఉన్న అందరిని సమానంగా చూస్తామని, ఆ ప్రభు చూపిన మార్గంలో నడుచుకుంటామని ఈ సందర్భంగా ఈస్టర్ శుభాకాంక్షలు క్రైస్తవులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ గౌరవాధ్యక్షులు ఎలిసా, ఎంసిపిఎఫ్ అధ్యక్షులు ఐతు డేవిడ్, ఐతు లూకా, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా - సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందo, కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.