28-03-2025 06:04:37 PM
నేడు జేష్ఠా దేవి కళ్యాణోత్సవం
భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు
జహీరాబాద్: ప్రజలకు ప్రకృతి ప్రశాంతతకు నిలయంగా మారిన శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శని అమావాస్య వేడుకలకు ఆశ్రమం తరపున భారీ ఏర్పాట్లు చేశారు. శనివారం ఝరా సంఘం మండలం బర్దిపూర్ లోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో జేష్టాదేవి కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దస్తగిరి మహారాజ్ ఆశ్రమంలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని విపరీతమైన ఎండలు ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు. త్రాగునీరు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం 5 గంటల నుండి శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం శని మహా యజ్ఞం జేష్టాదేవి సమేత శనీశ్వర స్వామి కళ్యాణోత్సవం మహా మంగళహారతి నిర్వహించినట్లు దస్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి ఒకవై ఎనిమిది వైరాగ శశికామని అవధూత గిరి మహారాజు తెలిపారు. అమావాస్య తిథి పితృ దేవతలకు ముఖ్యమైనదని శనివారం అమావాస్య రావడం వల్ల పేతురు దేవతలను స్మరించుకోవడం వారికి తరపున చేసుకోవడం శివప్రదంగా భావిస్తారని ఆయన తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శని అమావాస్య వేడుకలకు విజయవంతం చేయాలని అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రసాద వితరణ చేయబడును అని ఆయన తెలిపారు.