calender_icon.png 21 September, 2024 | 8:19 AM

జహీరాబాద్‌లో జెండా పంచాయితీ

21-09-2024 01:33:53 AM

  1. ఓ వర్గం జెండాను తొలగించిన యువకులు
  2. అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు  

సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి)/జహీరాబాద్: జహీరా బాద్‌లో ఓ వర్గం వారు, మరో వర్గం జెండాను తొలగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వి వరాలిలా ఉన్నాయి.. గురువారం ఓ వర్గం వారు జహీరాబాద్ పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న యువకులు మహీంద్రా అండ్ మహీంద్రా కాలనీలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న జెండాను తొలగించి, వీడియోను సోషల్ మీడి యాలో వైరల్ చేశారు.

మరో వర్గం వారు ఆ వీడియో విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు సమాచా రం. దీంతో అప్రమత్తమైన  పోలీసులు వెంటనే వీడియోను పరిశీలిం చి జెండాను తొలగించిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఎస్పీ రూపేష్ పోలీసులను అప్రమత్తం చేశారు. జహీరా బాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు జరగకుండా డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, ఎస్సై కాశీనాథ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండాను తొలగించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.