హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. లేఖ పత్రలను మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,సీఎస్ శాంతికుమారికి పంపించారు. తెలంగాణ రాష్టం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కార్మికులు విదేశాల్లో మరణిస్తే వారికి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉపాధి పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.