calender_icon.png 26 December, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మచ్చర్ల లిప్ట్ కేసిఆర్ గిప్ట్

25-12-2024 10:28:14 PM

బిజెపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలు

గెలిచిన బిజెపి ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్

ఓడిని కాంగ్రెస్ నేత అవినీతి పుల్

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ది కిల్

బీఆర్‌ఎస్ హయంలోనే లిప్టుల మంజూరు

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్,(విజయక్రాంతి): రైతుల చిరకాల వాంచ అయిన మచ్చర్ల లిప్టు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన గిప్ట్ అని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మచ్చర్ల లిప్టు పనులను బుధవారం పరిశీలించిన జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన మూడుకొత్త లిప్టులు బీఆర్‌ఎస్ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. మచ్చర్ల, జోధ్‌పూర్, కుద్వాన్‌పూర్ గ్రామాల రైతులకు చెందిన 2,860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల లిప్టుకు రూ.40 కోట్లు, చిక్లీ గుంజిలీ లిప్టుకు రూ.89 కోట్లను తాను మంజూరు చేయించానని జీవన్‌రెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎస్ హయంలో మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిప్ట్ పనులను గత ఏడాదిగా చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. పైగా కాంగ్రెస్ నాయకులు మందికి పుటినోళ్లు మావాళ్లే అన్న చందంగా బార్‌ఎస్ హమంలో మంజూరైన లిప్టులను తామే మంజూరు చేయించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను రెండ దఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మచ్చర్ల లిప్టుకు రూ.40 కొట్లు మంజూరు అయ్యాయని, నిధులకు సంబంధించిన జీవో కూడా వచ్చి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారారన్నారు. నియోజకవర్గ అభివృద్దిలో రాజీపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ బీజెపి పార్టీలను వెంటాడి తీరుతామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.