03-03-2025 03:28:38 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు కేసీఆరే(Kalvakuntla Chandrashekar Rao) కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Congress leader Jeevan Reddy) ఆరోపించారు. మేడిగడ్డ వద్ద మూడో టీఎంసీ రూ. 4 వేల కోట్లు ఖర్చు అయిందన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు(Tummidihetti Barrage) పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీళ్లు వచ్చేవని జీవన్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ నిరుపయోగమైనా సుందిళ్ల నుంచి నీళ్లు తీసుకునేవాళ్లమని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వమైనా తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.