హైదరాబాద్ : జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం గండిమైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో అనుకోకుండా నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనం ఆపాడు. ఇది గమనించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి డ్రైవర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ చెంప చెల్లుమనిపించడంతో పాటు బండ బూతులు తిట్టాడు. దీంతో అగ్రహించిన ఇతర రాష్ట్ర డ్రైవర్లు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బదిలీ వేటు..
లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన వీడియో వైరల్ కావడం, మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేయడంతో సదరు ట్రాఫిక్ పోలీస్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.