* మ్యాథ్స్ నుంచి లెన్తీ ప్రశ్నలు
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జేఈఈ మెయి న్ సెషన్ పరీక్షలు తొలిరోజు బుధవారం జరిగాయి. దాదాపు 1.50 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ పరీక్షను నిర్వహించారు.
అయితే రెండు షిఫ్టుల్లోనూ పేపర్ మధ్యస్థంగా వచ్చినట్లు విద్యానిపుణులు తెలిపారు. మ్యాథ్స్ నుంచి లెన్తీ ప్రశ్నలు రాగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మధ్యస్థంగా వచ్చినట్లు తెలిపారు. అన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు సమాంతరంగా అడిగారు. ఫిజిక్స్ నుంచి వచ్చిన దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలాగే ఉండగా, కొన్ని ప్రశ్నలను మాత్రం లోతుగా అడిగారు.