18-04-2025 12:48:33 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెష న్-2 ఫైనల్ కీని ఎన్‌టీఏ గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెషన్-2 పరీక్షల ను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణన లోకి తీసుకొని ర్యాంకులు కేటాయించనున్నారు.
అయితే, జేఈఈ- మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదా లు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండటంపై తుది కీ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని ఎన్టీఏ సూచించింది. తుది కీ మాత్రమే స్కోరు ను నిర్ణయిస్తుందని, ప్రాథమిక కీల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని స్పష్టం చేసింది.
ఈక్రమంలోనే తుది కీని విడుదల చేసిం ది. గతంలో తుది కీ, ఫలితాల ను ఒ కే రోజు ఎన్టీఏ విడుదల చేసిన సం దర్భాలున్నాయి. దీంతో అభ్యర్థు లు గురువారం 10 గంటల వరకు ఫలితాల కోసం వేచి చూశారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది.