calender_icon.png 19 January, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్ సెషన్ అడ్మిట్ కార్డులు విడుదల

19-01-2025 01:08:49 AM

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్  (జనవరి 2025) అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ శనివారం విడుదల చేసింది. ఈనెల 22, 23, 24న పేపర్1(బీఈ/బీటెక్) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ప్రస్తుతం అందుబాటులో ఉంచుతున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

28, 29, 30న నిర్వహించే పేపర్ పేపర్ (బీఆర్క్, బి.ప్లానింగ్) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో జారీ చేస్తామని పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి.