11-03-2025 12:02:41 AM
పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ రెండో దశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సోమవారం విడుదల చేసిం ది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిం ది. పేపర్-1 పరీక్షను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు షిప్టుల్లో, 8వ తే దీన మొదటి షిప్టులో జరగనుంది.
అలాగే ఏప్రిల్ 9న పేపర్-2ఏ, పేపర్-2బీ పరీక్షలు నిర్వహించనున్నా రు. ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిప్ట్ జరగనున్నాయి.