calender_icon.png 27 December, 2024 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల

29-10-2024 01:48:07 AM

  1. మొదటి సెషన్ జనవరిలో
  2. ఏప్రిల్‌లో రెండో సెషన్ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జేఈఈ (జాయింట్ ఎం ట్రెన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ప్రకటించింది. మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు జరగనున్నాయి.

రెండో సెషన్ ఏప్రిల్‌లో జరగుతాయి. దరఖాస్తు ప్రక్రియను అక్టోబర్ 28 (నిన్నటి) నుంచి నవంబర్ 22 వరకు చేపట్టనున్నారు. ఫలితాలను 2025, ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. తెలుగు, తమిళంతో పాటు మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు.

మొదటి షిఫ్ట్‌లో ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. పేపర్ 1 (బీఈ/బీటెక్), పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్2బీ (బీ ప్లానింగ్)కు పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షా తేదీలకు మూడు రోజుల ముందు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మిగతా వివరాలకు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది.