11-02-2025 01:30:35 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్తుది కీ విడుదలైంది. ఇటీవల ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి ఈనెల 4 నుంచి 6వరకు అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన సేపర్ పరీక్ష కీని ఎన్టీఏ సోమవారంతుది కీ ని విడుదల చేసింది.
పేపర్ సంబంధించి తుది కీ నుంచి మొత్తంగా 12 ప్రశ్నలు డ్రా ప్ అయినట్లు ఎన్టీఏ తెలిపింది. ఆయా ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మా ర్కుల చొప్పున కలిపే అవకాశమున్నట్లు తెలిసింది. ఫలితాలు 12న విడుదల చేయనున్నట్లు సమాచారం.