- మే 2 వరకు దరఖాస్తుకు అవకాశం
- మే 18న పరీక్ష నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్‌లో కనీస మార్కు లు సాధించిన అభ్యర్థులు వచ్చే ఏడాది ఏప్రి ల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్-2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐఐటీ కాన్పూర్ విడుదల చేసిన బ్రౌచర్‌లో ప్రకటించింది. ఐ ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది.
మెయిన్స్‌లో కనీస స్కోరు సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే అ ర్హులని.. మే 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం లో 17,695 బీటెక్, బీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు బీఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5న నిర్వహించనుండగా.. తెలంగాణ, ఏపీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.