హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ దరఖాస్తు నంబర్, అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి మే 26 మధ్యా హ్నం 2.30 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్ 2న విడుదల చేసి తుది కీ ఫలితాలను జూన్ 9న ప్రకటించనున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మ కమైన ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.