- బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న రాష్ట్ర యూనిట్
- నిర్ణయాన్ని తోసిపుచ్చిన జేడీయూ అధి నాయకత్వం
న్యూఢిల్లీ, జనవరి 22: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పొలిటికల్‌గా అనూహ్య పరిణామాలు చో టుచేసుకున్నాయి. ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుటున్నట్లు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు. ఈ ప్రకటనను పార్టీ అధినాయకత్వం తోసిపుచ్చింది. మద్దతు ఉపసంహరించుకుంటున్నామన్న మాటల్లో నిజం లేదని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తేల్చిచెప్పారు.
పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండా మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ రాసినందుకు పార్టీ మ ణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.