బిజెపి మండల అధ్యక్షుడు మోలుమూరి శ్రీనివాస్
మంథని (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న రామగిరి మండలం సెంటీనరీ కాలనీలోని వాణి (ప్రైవేటు) పాఠశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా అదనపు కలెక్టర్ వేణుకు ఫిర్యాదు చేసినట్టు బిజెపి మండల అధ్యక్షుడు మోలుమూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం సహకారంతో రామగిరి మండలం, సెంటినరీ కాలనీలో నిర్వహించబడుతున్న వాణి సెకండరీ (ప్రైవేటు) పాఠశాలలో దాదాపు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇందులో చాలా వరకు సింగరేణి కార్మికుల పిల్లలు, ప్రభావిత గ్రామల పిల్లలు, పేద పిల్లలు చదువుతున్నారని, ఎస్సి, ఎస్టి లకు ఉచిత విద్య, బిసి, మైనారిటి, వెనుకబడిన తరగతుల వారికి తక్కువ ఫీజులు తీసుకోవాలనే ప్రభుత్వ నిబందన ఉన్నప్పటికీ విధ్యాసంస్థ యాజమాన్యం తమ ఇష్టరాజ్యంగా విధ్యార్థులను దోచుకుంటూ, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు.
ఉపాద్యాయ, ఉపాధ్యాయునీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పీఎఫ్ కటింగ్ కూడా చేయడం లేదని, ఈ విషయంపై పలు మార్లు సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పెద్దపల్లి డీఈఓ కు రామగిరి ఎంఈఓ లకు విజ్ఞప్తి చేసినా కూడా ఎటువంటి ఫలితం లేదని, 1000 మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే డీఈఓ, ఎంఈఓలపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ నిబందనలను ఉల్లంగిస్తున్న స్కూల్ యొక్క అనుమతి పత్రాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట బిజెపి సీనియర్ నాయకులు మేరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.