అమరావతి,(విజయక్రాంతి): సినీనటి, బీజేపీ నేత మాధవీలతను ఆవేశంతో మాట్లాడటం తప్పేనని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) అంగీకరించారు. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలో మహళల కోసం జేసీ పార్క్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్ కు మహిళలు వెళ్లొద్దని, అక్కడ మహిళకు అపాయం కలుగొచ్చని మాధవీలత(Madhavilatha), బీజేపీ నాయకురాలు సాదినేని యామిని(BJP leader Sadineni Yamini) వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యాలపై జేపీ ప్రభాకర్ స్పందించి మాధవీలత ప్రాస్టిట్యూట్ (వ్యభిచారి) అని సంబోధించారు. దీనిపై సర్వత్రా వివర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేపీ ఆదివారం తన నివాసంలో మీడియా ఏర్పాటు చేసి మాధవీలతపై చేసిన వ్యాఖ్యాలు తప్పేనని, నోరు జారానని అంగీకరించి, ఆమెను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మీడియా సందర్భంగా మాధవీ లతకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు జేపీ ప్రభాకర్ వెల్లడించారు.