ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట వరకు ఫ్లుఓవర్ పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. శుక్రవారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు సమావేశం అనం తరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. ఫ్లుఓవర్ నిర్మాణంతో ఆ ప్రాం తంలోని షాపులు, ఇళ్లు, స్థలాలు నష్టపోతున్న వారికి పరిహారం ఇవ్వాలన్నారు.
ఫ్లుఓవర్ నిర్మాణం వల్ల కంటోన్మెంట్ నష్టపోతున్న భూమి విలువ రూ. 330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఖాతాలో జమ చేయకుండా కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఈ విషయంపై తాము కేంద్ర ప్రభుత్వం మాట్లాడతామని తెలిపారు.
మిలిటరీ ఏరియాలో ఉన్న ఆలయాలకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని, ఈ తరహా ఇబ్బందులు కలగకుండా చూడాలని కంటోన్మెంట్ అధికారు లను కోరారు. అంతకు ముందు తూంకుంటలో హనుమంతుడి విగ్ర హ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.