- నార్త్‌సిటీకి మెట్రో విస్తరణ ఇక్కడినుంచే
- మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లకు జేబీఎస్‌లో ఇంటిగ్రేట్ హబ్ ఏర్పాటు
- మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): నగరంలోని జేబీఎస్ మెట్రో స్టేషన్ ప్రధాన జంక్షన్‌గా మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మెట్రో కారిడార్లను విస్తరించేందుకు మెట్రో అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడే ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా కసరత్తును ప్రారంభించారు.
అందులో భాగంగా ఆదివారం జేబీఎస్ క్లబ్‌రోడ్, స్టాఫ్‌రోడ్, మడ్‌ఫోర్ట్ రోడ్, టివోలీ జంక్షన్‌రోడ్, డైమండ్ పాయిం ట్ జంక్షన్, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్‌పేట్ జంక్షన్, బోయినపల్లి రోడ్, తాడ్‌బండ్-ఆంజనేయస్వామి ఆలయం రోడ్, తాడ్‌బండ్‌జంక్షన్-ఎయిర్‌పోర్ట్ జంక్ష న్, బోయినపల్లి చెక్‌పోస్ట్ రోడ్ తదితర ప్రాంతాల్లో సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులతో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
జేబీఎస్ జంక్షన్‌గా మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో విస్తరణ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. జేబీఎస్‌ను ప్రపంచస్థాయి మెట్రోహబ్‌గా మార్చేలా జేబీఎస్ పరిసరాల్లోని రాష్ట్ర ప్రభు త్వ, కేంద్ర రక్షణ శాఖకు చెందిన సుమారు 30ఎకరాల భూమిని సమీకరించబోతున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. కాగా ఇటీవల ప్యారడైజ్-మేడ్చల్(23కి.మీ),జేబీఎస్-శామీర్‌పేట్ (22 కి.మీ) కారిడార్లను మెట్రో అధికారులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఎయిర్‌పోర్టు కారిడార్ అనుసంధానం
మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లను జేబీఎస్ వద్ద కలపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. దీంతో మేడ్చల్ -జేబీఎస్- ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట-ఆర్జీఐ ఎయిర్‌పోర్టు కారిడార్‌తో 60కిలోమీటర్ల మేర అనుసంధానం అవుతుందని తెలిపారు.
సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్‌గా కరీంనగర్ హైవేపై నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌పై జేబీఎస్-శామీర్‌పేట్ కారిడార్‌ను పొడగించవచ్చని పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బీ ఆనంద్‌మోహన్, జీఎంలు బీ ఎన్‌రాజేశ్వర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలకృష్ణ, డిప్యూటీ సీఈ జేఎన్‌గుప్తా, అధికారులు పాల్గొన్నారు.