02-03-2025 12:12:55 AM
* బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, మార్చి 1 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ కార్మికులతో సంబం ధిత జేపీ కంపెనీ యాజమాన్యం చెలగాటమాడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహే శ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతంలోని ప్రమాద ఘటన ప్రదేశాన్ని ఆయన సందర్శించి, మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం నిపు ణుల సూచనలు లేకుండానే పనులు ప్రారంభించిందని విమర్శించారు. జేపీ కంపెనీ అల సత్వం కూడా తోడు కావడంతో ఈ ప్రమా దం జరిగిందని ఆరోపించారు. కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్న జేపీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశా రు. సొరంగ పనులు దక్కించుకున్న జేపీ కంపెనీ యాజమాన్యానికి డబ్బులు మిగిల్చే కుట్ర జరిగిందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉందని ఆరోపించారు. ఆయనవెంట బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్, రాకేష్‌రెడ్డి, హరీష్‌కుమార్ బాబు, ధన్‌పాల్ సత్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిరెడ్డి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కిషన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఉన్నారు.