calender_icon.png 7 January, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన పేర్ని జయసుధ విచారణ

02-01-2025 02:44:38 AM

  1. రేషన్ బియ్యం మళ్లింపు కేసులో 
  2. రెండున్నర గంటల పాటు ప్రశ్నలు

అమరావతి, జనవరి 1: రేషన్ బియ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసు ధ బుధవారం తన న్యాయవాదులతో కలిసి ఆర్.పేట తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కేసులో ఏ1 నిందితు రాలైన ఆమెను సీఐ ఏసుబాబు రెండున్నర గంటల పాటు విచారించారు.

అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వంలో పేర్ని నాని మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో సతీమ ణి పేరిట గోదాములు నిర్మించి, వాటిలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు ఇటీవల పౌరసరఫరాలశాఖ తనిఖీల్లో బయటపడింది. అధికారిక రికార్డుల్లో నమోదైన నిల్వలకు, గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్‌కు భారీ తేడా ఉండడంతో యంత్రాంగం తదుపరి చర్యలకు పూనుకున్నది.

దీనిలో భాగం గానే పేర్ని జయసుధకు నోటీసులు జారీ అయ్యాయి. దారి మళ్లించిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ.1.70 కోట్లు ఉంటుందని, జయసుధ ఇప్పటికే అంతకుఅంత చెల్లించారు. ఈ కేసులో పోలీసులు ఆమెను ఏ1 నిందితురాలు అని ఎఫ్‌ఐఆర్‌లో నమో దు చేశారు. విచారణ సైతం వేగవంతమైంది.