calender_icon.png 27 February, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

27-02-2025 03:34:35 PM

కాటారం,(విజయక్రాంతి): పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సరలిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Jayashankar Bhupalpally District Collector Rahul Sharma) పరిశీలించారు. గురువారం కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ పర్సంటేజ్ వివరాలను తాసిల్దార్ నాగరాజును అడిగి కలెక్టర్ శర్మ తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు వసతి సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న తీరు పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎన్నికల అధికారులు రాజశేఖర్, వెంకన్న, పంచాయతీ కార్యదర్శి షాఘీర్ ఖాన్ ఉన్నారు.