బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
డెడ్ బాడీతో బాధిత కుటుంబం ధర్నా
ఎస్పీ హామీతో విరమించిన కుటుంబసభ్యులు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జాటోత్ రాంధన్ నాయక్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడంతో బాధిత కుటుంబం సింగరేణి హాస్పిటల్ పెద్దాపూర్ వెళ్లే రోడ్డుపై డెడ్ బాడీతో ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని కూర్చున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామ్ ధన్ నాయక్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో ఎస్పీ ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణమైన వారిని వదిలిపట్టమని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.