అభినందించిన సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్...
మందమర్రి (విజయక్రాంతి): ఏరియా ఉత్తమ సింగరేణి అధికారిగా సివిల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరిండెంట్ మేకల జయప్రకాష్ ఎంపికయ్యారు. సోమవారం నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో యాజమాన్యం ఉత్తమ అధికారిగా ఎంపిక చేసింది. ఉత్తమ అధికారిగా ఎంపికైన జయప్రకాష్ ను సింగరేణి సివిల్ కాంట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా సివిల్ డిప్యూటీ సూపర్డెంట్ గా ఏరియాలో సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారం దక్కిందని వారు తెలిపారు. ఉత్తమ అధికారిగా ఎంపిక చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్, ఎస్ఈ రామ్ నాయక్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.